ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్‌షా' . ఈ చిత్రం ఏప్రిల్ 5న చిత్రాన్ని
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ నిర్మాత అయినా
తమ చిత్రానికీ ఏ పోటీ లేకుండా ఉండాలని చూసుకుంటారు. అదే కోవలో నిర్మాత
బండ్ల గణేష్ కూడా ఆలోచించే ఈ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ పరిశ్రమలో
వింటున్న దాన్ని బట్టి..నాగార్జున గ్రీకు వీరుడు, వెంకటేష్ షాడో చిత్రమూ
ఏప్రియల్ నెలలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో అనుకున్నట్లుగా
ఎన్టీఆర్ కు రూట్ క్లియర్ కాకపోగా..సీనియర్ హీరోలనుంచి పోటీ ఎదురవుతోంది.
మరో ప్రక్క ఎన్టీఆర్ చిత్రానికి దాదాపు యాభై కోట్ల పై చిలకు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ రేంజిలో సినిమాకు ఖర్చు చేయడంపై టాలీవుడ్ ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ప్రొడక్షన్ ఖర్చు సినిమా విడుదలకు ముందే రాబడుతోందని అంటున్నారు.
ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతున్న ఈచిత్ర కథాంశాన్ని యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మలిచారు రచయితలు కోన వెంకట్, గోపీమోహన్. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు ఏ మాత్రం సంశయించకుండా తెరకెక్కిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో జరిగింది. కొన్ని సీన్లను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు. క్లైమాక్స్ కు సంబంధించిన కొన్సి యాక్షన్ సీక్వెన్స్ ఇటీవల నాగార్జున సాగర్ వద్ద చిత్రీకరించారు. క్లైమాక్స్ కోసం భారీ సెట్లు వేసారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం క్లైమాక్స్ కోసమే వెచ్చించారట.
తెలుగు సినిమా మార్కెట్‌ను పరిశీలిస్తున్న ట్రేడ్ నిపుణులు ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం పెట్టుబడి తిరిగొచ్చి...మంచి లాభాల దిశగా బిజినెస్ చేస్తుందా? అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినీ సర్కాల్లో ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాలు, విడుదలకు ముందే ఈ సినిమా చేస్తున్న బిజినెస్‌ను బట్టి మాత్రం....సినిమా హిట్టయితే ఓ రేంజిలో కలెక్షన్లు రావడం, రికార్డులు బద్దలు కొట్టి లాభాలు తేవడం ఖాయమని మరికొందరంటున్నారు.
ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన గుంటూరు రైట్స్ రూ. 4 కోట్లు, వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 2.66 కోట్లకు అమ్ముడయి రికార్డు సృష్టించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈనేపథ్యంలో సినిమా హిట్ వస్తే పలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

No comments:
Post a Comment