ఈ నేపథ్యంలో నందినీరెడ్డి మాట్లాడుతూ...‘విశ్వరూపం' చిత్రం కాంట్రవర్సీ తర్వాత సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ‘అల్లా అల్లా' పదంలో ముస్లింలను కించ పరిచే విధంగా ఏముందో నాకు అర్థం కావడం లేదు. సెన్సార్ బోర్డ్ కఠిన నిర్ణయాల వల్ల సినిమా స్వేచ్ఛ హరించ బడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సినిమా ప్రపంచం చీకటి యుగాలకు వెలుతుంది.' అని ఆమె అభిప్రాయ పడ్డారు.
‘అదే విధంగా సినిమాలో చాలా డైలాగులను తొలగించారు. సెన్సార్ బోర్డు తీరు మరీ దారుణంగా ఉంది. సినిమాలు ఎలా తీయాలో, ఎలాంటి పదాలు వాడకూడదో, ఎలాంటి పదాలు వాడాలో స్పష్టం వెల్లడిస్తూ సెన్సార్ బోర్డు వారు ఓ టెక్ట్స్ బుక్ రిలీజ్ చేస్తే బాగుటుంది' అంటూ నందినీరెడ్డి ఘాటుగా స్పందించారు.
సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న ‘జబర్‌దస్త్' మూవీని ఫిబ్రవరి 22న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో నందినీరెడ్డి దర్శకత్వం వహించని ‘అలా మొదలైంది' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment