బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తల్లి, ప్రముఖ నటి షర్మిల ఠాగూర్ ఆసుపత్రి
పాలయ్యారు. ఆమె తిన్న ఆహారం విషతుల్యం కావడం వల్లనే షర్మిల ఆసుపత్రి
పాలైనట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల తన భర్త, కీ.శే. మన్సూర్ అలీఖాన్
పటౌడీ స్మారకోపాన్యాస సభకు హాజరు కాలేక పోతున్నారు.
ఈ విషయమై షర్మిల పిటిఐతో మాట్లాడుతూ, తన భర్త స్మారకోపాన్యాస సభకు హాజరు కాక పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ‘చెన్నయ్‌లో జరుగుతున్న నా భర్త స్మారకోపన్యాస సభకు హాజరు కాలేక పోవడం ఎంతో దురదృష్ణ కరం. నేను తిన్న ఆహారం విషతుల్యం కావడం వల్ల ఆసుపత్రిలో ఉన్నాను. ఇందుకు ఎంతో చింతిస్తున్నాను' అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
షర్మిల ఠాగూర్‌కు వీలు కాక పోయినా, ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా హాజరవుతారా? అని ఆమెను ప్రశ్నించగా, తన కొడుకు సైఫ్, కూతుర్లు సోహా, సభ తమ తమ పనులు, సినిమా షూటింగుల్లో భాగంగా బిజీగా ఉన్నారని, అందు వల్ల వారు కూడా హాజరు కాలేక పోతున్నారని షర్మిల చెప్పుకొచ్చింది. అనారోగ్యం కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాకపోతున్నందుకు ఎంతో బాధగా ఉందని షర్మిల చెప్పుకొచ్చారు.

No comments:
Post a Comment