జూ ఎన్టీఆర్-బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా రూపొందబోతున్న ‘రభస' చిత్రానికి గాను జూ ఎన్టీఆర్ టాలీవుడ్లోనే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోనంత భారీ మొత్తం రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడని టాక్. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే.
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇతర స్టార్ హీరోలైన రామ్ చరణ్ రూ. 12 కోట్లు, ప్రభాస్ రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడని వినికిడి. అయితే బెల్లంకొండ సురేష్ ‘రభస' చిత్రం కోసం జూ ఎన్టీఆర్ కు రూ. 18 కోట్లు ఆఫర్ చేసాడని టాక్. ఇటీవలి కాలంలో జూ ఎన్టీఆర్ ఖాతాలో హిట్ సినిమాలు లేక పోయినా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదే విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ ను అడగ్గా అంత పెద్ద మొత్తంలో తాను రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. నేను బాలీవుడ్ లేదా హాలీవుడ్ సినిమా తీయడం లేదని, తెలుగు సినిమాల మార్కెట్ లిమిటెడ్, అందుకు తగిన విధంగానే రెమ్యూనరేషన్లు ఉంటాయని స్పష్టం చేసారు.
No comments:
Post a Comment