రామ్ చరణ్ ని ‘జాక్సన్ కా బాప్' అంటూ పొగడ్తలలో ముంచెత్తుతున్నాడు
బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా. ఆయన తాజాగా రామ్ చరణ్ తో జంజీర్ రీమేక్
చేస్తున్నారు. ఆ సినిమా కోసం రీసెంట్ గా ఓ పాటను షూట్ చేసారు. ఆ పాటలో రామ్
చరణ్ స్టెప్స్ మైఖల్ జాక్సన్ ని మించిపోయాయంటూ మెచ్చుకుంటూ... ఇలా ట్వీట్
చేసారు.
అపూర్వ లఖియా చేసిన ట్వీట్ ఏమిటంటే..." ఇప్పుడే జంజీర్ కోసం రామ్ చరణ్ పై "ముంబైకి హీరో" షూట్ చేసాం.... స్టెప్స్ తో రామ్ చరణ్ చంపేసాడు.. జాక్సన్ కి బాప్ హై హూ బాస్...", అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి ట్వీట్స్ సినిమాపై చాలా అంచనాలు పెంచుతున్నాయి. ట్రైలర్స్ లో ఈ సాంగ్ ని వదలనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే రామ్ చరణ్ తన స్టెప్స్ తో నాయక్, రచ్చ వంటి చిత్రాలలో ఆంధ్రా ప్రేక్షకులను అదరకొట్టారు. త్వరలో బాలీవుడ్ కి కూడా తన స్టెప్స్ రుచి చూపించనున్నారన్నమాట.
రామ్ చరణ్ తాజాగా హిందీలో 'జంజీర్' రీమేక్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఇక్కడ ఆంద్రాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి గానూ మెరుపు అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. మెరుపు టైటిల్ తో గతంలో రామ్ చరణ్ హీరోగా సినిమా మొదలై ఆగిపోయింది. తమిళ దర్శకుడు ధరిణి ఈ చిత్రం స్క్రిప్టు సరిగా లేకపోవటంతో ఆపేయాల్సివచ్చింది. ఆ స్లాట్ లోనే రచ్చ చిత్రం వచ్చి రిలీజై హిట్టైంది.
ఇక ఈ 'జంజీర్' చిత్రాన్ని హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మాత్రం దర్శకుడు యోగి పర్యవేక్షణలో చేస్తున్నారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సూచనల మేరుకు ఈ మార్పు జరిగినట్లు సమచారం. వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రం చేసిన యోగి ప్రస్తుతం బ్యాంకాక్ ఈ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కి నేటివిటీ కోసం ఈ దర్శకుడుని తీసుకున్నట్లు వినికిడి. ఇక ఈ చిత్రం విషయమై ప్రతీ దాన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రచ్చ విషయంలోనూ చిరంజీవి ఇలాగే దగ్గరుండి సినిమా చేయించుకున్నారు.
అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జెడిని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత.

No comments:
Post a Comment