మధుర శ్రీధర్ దర్శకత్వంలో వి.కె.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాంక్
బెంచ్ స్టూడెంట్'.‘వాడి బ్రేకప్ లవ్‌స్టోరి' అనేది ఉపశీర్షిక. మహత్
రాఘవేంద్ర, పియా బాజ్‌బాయ్, అర్చన కవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం
మార్చి 8 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం
పాటలు ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
‘‘కళాశాల జీవితానంతరం ఓ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్' వృత్తిపరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొన్న పలు సమస్యల సమాహారమే మా సినిమా. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నా నమ్మకం'' అని దర్శకుడు మధుర శ్రీధర్ చెప్తున్నారు.
చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కాలేజీ జీవితంలో పదహారు సబ్జెక్ట్‌సలో ఫెయిలై, గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకొని నిరాశగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ విద్యార్థి తన వైఫల్యాలన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి జీవిత పయనంలో విజయపథంలోకి ఎలా అడుగుపెట్టాడన్నదే ఈ చిత్ర కథాంశం అన్నారు. స్నేహగీతం ఇట్స్ మై లవ్‌స్టోరీ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్.వి .కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 90 శాతం చిత్రీకరణ పూర్తిచేశాం. దర్శకుడు మధుర శ్రీధర్ వాస్తవికతను ప్రతిబింబిస్తూ సహజత్వానికి దగ్గరగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు' అన్నారు. బ్రహ్మానందం, ఆలీ, శరత్‌బాబు, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్.జి.కె, సంగీతం: సునీల్‌కాశ్యప్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్.

No comments:
Post a Comment