Search

Thursday 21 February 2013

పేలుళ్లు: బాంబుల తయారీకి అమ్మోనియం నైట్రేట్?

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌షుక్ నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాది రియాజ్ భక్తల్ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతోంది. భక్తల్‌తో పాటు మరో ఉగ్రవాది 2012లో రెక్కీ నిర్వహించినట్లు చెబుతున్నారు. కాగా, బాంబుల తయారీకి అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు చెబుతున్నారు. బాంబుల తయారీకి ఈ రసాయనాన్ని వాడినట్లు జాతీయ దర్యాప్తు బృందం అనుమానిస్తోంది.
కాగా, హైదరాబాదులో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. పేలుళ్ల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదానికి మతం లేదని, దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. పేలుళ్ల ఘటనను ఆయన ఖండించారు.
 ammonium nitrate used make bombs
హైదరాబాద్ పేలుళ్ల సంఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖకర్జీ గురువారం రాత్రి తీవ్రంగా ఖండించారు. దేశంలోని శాంతిసామరస్యాలను దెబ్బ తీసేందుకు జరిపే ఇలాంటి దాడులను పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఏ మాత్రం సహించరాదని ఆయన అన్నారు. ప్రజలంతా శాంతి పాటించాలని ఆయన కోరారు. దేశంలోని శాంతి సామరస్యాలను ఉద్దేశ్యవూర్వకంగ దెబ్బ తీసే ఇలాంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటారు. బాధితులను పరామర్శిస్తారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆస్పత్రులను సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు.

No comments:

Post a Comment

Popular Posts