ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు తండ్రి నారాయణస్వామి నాయుడు ఈ నెల 10వ
తేదీన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనకు 11వ
రోజు కర్మకాండలు పూర్తి చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్
ప్రముఖులు, మోహన్ బాబు బంధు, మిత్రులు హాజరయ్యారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు, నిర్మాత డి రామానాయుడు లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై మోహన్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. నారాయణ స్వామి నాయుడు వయసు 95 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుళపాళేనికి చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించారు.
నారాయణస్వామినాయుడుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో నారాయణస్వామి నాయుడు హెడ్‌మాస్టర్‌గా సేవలందించారు. నారాయణ స్వామి నాయుడు భావాలకు అనుగుణంగానే మోహన్ బాబు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్కూల్ ను ఏర్పాటు చేశారు.

No comments:
Post a Comment